NTV Telugu Site icon

Chandrababu: రాజధాని పరిధిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu On Amaravati

Chandrababu On Amaravati

Chandrababu: వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆర్-5 జోన్ పరిధిలో వేర్వేరు జిల్లాలు.. నియోజకవర్గాలను తెచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. ఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారి వారి ప్రాంతాల్లోనే స్థలాలిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ లబ్దిదారుల కోసం భూమిని సమీకరించాలి.. లేదంటే భూ సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లేకుంటే టిడ్కో ఇళ్లనైనా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆర్-5జోన్ లోమాత్రం ఇళ్ల స్థలాలను కేటాయించలేమని ఆయన తెలిపారు.

 

Read Also: AP CM Chandrababu: రేషన్‌ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన