TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
- భారతదేశంలో మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి
- పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చు
- ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
- రాయలసీమ సమగ్ర అభివృద్ధి నా బాధ్యత
- ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో మరలా పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను కూడా రద్దు చేసి.. ఆర్ధిక లావాదేవీలను డిజిటల్లో మార్చిచే అవినీతిని రూపుమాప వచ్చన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సప్ గవర్నర్స్ తీసుకొచ్చాం అని, ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం అని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో భద్రత కల్పిస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు 2025లో సీఎం ప్రసంగించారు.
‘అన్నదాతకు రూ.20,000 ఇస్తున్నాం. మూడు విడతలుగా రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు శుభవార్త చెబుతూ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో భద్రత కల్పిస్తాం. ప్రభుత్వ పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతాం. పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సప్ గవర్నర్స్ తీసుకొచ్చాం, ఇది ఒక గేమ్ చేంజర్. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయండని, డిజిటల్ కరెన్సీ తేవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరా. అన్ని పెద్ద పెద్ద నోట్లు రద్దు చేయాలి, అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి నశిస్తుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
Also Read: Nara Lokesh: పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం.. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలు!
‘అమరావతి పూర్తి చేస్తాం. రాయలసీమ సమగ్ర అభివృద్ధి నా బాధ్యత. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఫ్యాక్షన్‌ను అంతం చేశాం. పోయిన ఐదు సంవత్సరాలలో ఇరిగేషన్ కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. హంద్రీనీవా కాలవ పనులు ఏడదిలో పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. కడపలో కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్‌ను పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తా. వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతా. దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలిపేందుకు నిరంతరం పనిచేస్తాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?