CM Chandrababu: తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన సీఎం.. అన్నదాతలకు భరోసా..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: ఇది గడ్డు సంవత్సరం.. అర్నబ్ తుఫాన్‌తో పంటలు దెబ్బతిన్నాయి.. వరుసగా రెండు తుఫాన్లు రావడం చరిత్రలో మొదటి సారని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరులో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం పరిశీలించారు. పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్లి బాధిత రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటల నష్టం అంచనా జరుగుతోందా అని ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అర్నబ్, మురసు తుఫాన్ లతో చాలా సమస్యలు వచ్చాయన్నారు. నీళ్ళు లేని పరిస్థితి ఏర్పాడిందని.. కృష్ణా నదికి వరద రాలేదన్నారు. పట్టిసీమ నీళ్ళ ద్వారా పంట సాగు చేశారని.. పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతిందని గుర్తు చేశారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ, ఆస్థి నష్టం తగ్గించామని చెప్పారు. రాయలసీమ రాళ్ళ సీమ.. ఆరేడు పెద్ద పెద్ద తుఫాన్లు చూశాను. ఇవి పాఠాలు నేర్పుతున్నాయన్నారు. మురసు ఎన్టీఆర్ జిల్లా నుండి ప్రకాశం వరకూ దెబ్బతీసిందని తెలిపారు. అకాల వర్షం, కుంభవృష్టి కురిసిందని.. 26 సెంమీ వర్షపాతం నమోదైందని స్పష్టం చేశారు.

కొందరు అర్నబ్ ఎక్కడా అంటూ ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. “పట్టిసీమ లేకపోతే త్రాగడానికే నీళ్ళు లేవు. రైతులు భీమా చేయించుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. పంట భీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వస్తేనే రైతులకు కొద్దీమేర మేలు జరుగుతుంది. టెక్నాలజీ ఉపయోగించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. నేను ఎలాంటి భేషజాలకు పోవడం లేదు. రెండు మూడు గంటలకొకసారి అధికారులతో సమీక్షలు నిర్వహించాం. భట్టి విక్రమార్కకు తమిళనాడు, కర్ణాటక సీఎంలకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాం. మన వరకే పని చేస్తే పది రోజులు పడుతుంది.అర్నబ్ లో కూలిన 30 వేల పోల్స్ సరి చేశాం. తుఫాన్ నష్టాన్ని తొలగించి జనజీవనాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చాం. 1893 గ్రామాల్లో సాధారణ స్థాయి తీసుకొచ్చాం. రేపు సాయంత్రానికి విద్యుత్ పూర్తిగా పునరుద్దరిస్తాం. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ఉద్యానవన పంటలు బాగా దెబ్బతిన్నాయి. కేంద్రానికి తుఫాన్ నష్టాన్ని వివరించాం.. అమిత్ షాకి ఫోన్ చేశాం. ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమలో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించింది. వరద నీరు సముద్రంలోకి పోయింది.” అని సీఎం వ్యాఖ్యానించారు.