CM Chandrababu: యోగాంధ్ర 2025 ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!

  • విశాఖపట్నంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
  • యోగాంధ్ర 2025 ఏర్పాట్లను పరిశీలించిన సీఎం
  • సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ
Cm Chandrababu

Cm Chandrababu

సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో యోగాంధ్ర 2025 ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. విశాఖ ఆర్కే బీచ్‌ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. యోగాంధ్ర ఏర్పాట్లు, వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. భద్రత ఏర్పాట్లను సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా వివరించారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, డోలా, పార్థసారధి ఉన్నారు.

Also Read: Kakumanu Rajasekhar: ఎంత అణిచి వేయాలని చూస్తే.. అంత పెద్దగా ఎదుగుతాం!

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఆకస్మికంగా గీతం యూనివర్సిటీకి సీఎం వెళ్లారు. అక్కడ అధికారులతో మాట్లాడారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్స్‌ సెంటర్‌లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమై యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళతారు.