NTV Telugu Site icon

CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం

Chandrababu

Chandrababu

CM Chandrababu: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు. కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారులకు వివరించారు. అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సౌండ్ లేకపోవడంతో అధికారుల తీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులలో నిర్లక్ష్యాన్ని సహించనన్నారు. ఇక నుంచి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read Also: YS Jagan: కలుషితాహారం తిని విద్యార్థులు మృతి.. వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

రాష్ట్రంలో సోమశిల చాలా కీలకమైనదని.. ఐదేళ్ల నుంచి జలాశయాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో నీటి కొరత ఉన్నా రైతుల కోసం 25 టీఎంసీల నీటిని వదిలామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులు నీటితో నిండాయని.. శ్రీశైలం నుంచి నీటిని తీసుకు వస్తామన్నారు. సోమశిలలో కొన్ని గేట్లు తుప్పు పట్టాయని… ఆఫ్రాన్ దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నీటి ప్రాముఖ్యత తనకు బాగా తెలుసని.. గతంలో సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు 90 శాతం పూర్తి చేశామన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంతో ఆ నీరు అంతా సోమశిలపై పడి.. ఆఫ్రాన్ దెబ్బతిందన్నారు. గతంలో ఏ ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లాలో ప్రజలు ఇంతటి తీర్పు ఇవ్వలేదన్నారు.

Read Also: Minister Subhash: గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి సుభాష్

టీడీపీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలు చూశానన్న ఆయన.. ఇంతటి తీర్పు ఎప్పుడూ రాలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కరువు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. 692 టీఎంసీల నీటి నిల్వ రాష్ట్రంలో ఉందని.. 20 ఏళ్ల తర్వాత డ్యామ్‌లు ఆగస్ట్ లోనే నిండాయన్నారు. కృష్ణా బేసిన్‌లో కూడా నీరు సమృద్ధిగా ఉందన్నారు. నీరు ఒక సంపద అని.. దీనికి కాపాడేందుకు ప్రభుత్వంతో పాటూ ప్రజలు కూడా సహకరించాలన్నారు. సోమశిల మరమ్మతులకు రూ.95 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. గుండ్లకమ్మ గేట్లు పోతే పట్టించుకోలేదు.. కాంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వలేదు. అందుకే పనులు జరగలేదన్నారు. సోమశిల మరమ్మతు పనులను వర్షాలు వచ్చే లోగా పూర్తి చేశామన్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వెళితే.. పోలీసుల ద్వారా పట్టుకొస్తామన్నారు. అధికారులు కూడా బాధ్యతగా మెలగాలన్నారు.పాత విధానాలు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సర్వే రాళ్లకే రూ.700 కోట్లు… జగన్ ఖర్చు పెట్టారని.. ఋషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారని.. దానిని ఏమి చేయాలో తెలియడం లేదని సీఎం విమర్శలు గుప్పించారు.

Read Also: CM Chandrababu: కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం వెళ్లారని.. ఇప్పుడు సోమశిలకు వచ్చారన్నారు. “మూడేళ్ళ నుంచి సోమశిలపై మాకు భయంగా ఉందని.. సోమశిల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇక్కడికి వచ్చినపుడు.. హై లెవెల్ కెనాల్ గురించి చెప్పామని.. ఇప్పుడు దానిపై దృష్టి పెట్టారని మంత్రి వెల్లడించారు. పొంగూరు, పడమటి నాయుడు పల్లి రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వమని అధికారులకు ఆదేశించారని తెలిపారు. సోమశిల గేట్లు ఉంటాయా లేదా అనే అనుమానం మాకు ఉందని.. అందుకే ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారని మంత్రి స్పష్టం చేశారు.