Andhra Pradesh: కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్రుల పెర్ఫార్మెన్సుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే మంత్రులకు మార్కులు ఇచ్చారు. ఎవరి పనితీరు ఏ రకంగా ఉంది అనే ఒక అంచనా కూడా వేశారు సీఎం చంద్రబాబు. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు మంత్రులకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. శాఖపై ఎంతవరకు పట్టుంది.. జిల్లాలో ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారా.. వైసీపీ విమర్శలకు ఎలా కౌంటర్ ఇస్తున్నారు.. సోషల్ మీడియాలో ఏ రకంగా ఉంటున్నారు.. ఇలా కొన్ని అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు మార్కులు వేశారు.
Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం
ప్రస్తుతం సీఎం గుడ్ లుక్స్‌లో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నట్టు తెలిసింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారు. కొంతమంది మంత్రులు మాత్రం జిల్లాల్లో ఎమ్మెల్యేలతో సరిగ్గా లేరనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏమి చెప్పినా పెద్దగా పట్టించుకోకపోవడం, ప్రధానంగా వైసీపీ కి సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది….కొందరు మంత్రులు ఇప్పటికైనా పని తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని అనే ఇండికేషన్ కూడా బాబు ఇచ్చారు.
శాఖలపై పట్టు పెంచుకోవడంతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. వచ్చే నెల రోజుల్లో పద్ధతి మార్చుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఇంచార్జి మంత్రుల పర్యటనలపైన కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరి జిల్లాకు ఆయా మంత్రి బాధ్యత తీసుకుని ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారని కూడా చెబుతున్నారు. అప్పుడే మంత్రుల పెర్ఫార్మెన్స్ ఏంటని కూడా కొంతమంది మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. కేవలం ఆరు నెలలకే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని అనుకుంటున్నారు కొందరు మంత్రులు. మంత్రులకు గ్రేడ్లు, మార్కులు అనే చర్చ బాగా జరిగితే మంత్రులపై సదభిప్రాయం ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది.