NTV Telugu Site icon

CM Chandrababu: బాలకృష్ణకు పద్మ భూషణ్.. చంద్రబాబు అభినందనలు

Cm Chandrababu

Cm Chandrababu

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వరించిన సంగతి తెలిసిందే.. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమానికి బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా అంకితభావంతో ఎంతో మందిని కాపాడుతున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తినిస్తున్న నిజమైన ఐకానిక్‌ నాయకుడికి తగిన గౌరవం లభించిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Padma Awards: అశ్విన్‌కు పద్మ శ్రీ, పిఆర్ శ్రీజేష్‌కు పద్మ భూషణ్..

పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా నందమూరి బాలకృష్ణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. “నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో చేసిన అద్భుతమైన కృషి, ప్రజాసేవలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ అత్యున్నత సత్కారం లభించడం చాలా గర్వకారణం. ఆయనకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం, బాలకృష్ణ భవిష్యత్తు మరింత విజయవంతం కావాలి. ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలి” అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

Read Also: Balakrishna: బాలకృష్ణను వరించిన పద్మ భూషణ్.. తెలుగు సినిమా రంగంలో విశేష కృషికి ఘనమైన గుర్తింపు

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ ప్రకటించడం పట్ల మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో బాలకృష్ణ చేసిన సేవలకు మంచి గుర్తింపు రావడం అభినందనీయం అని అన్నారు. ఒకవైపు కళామ తల్లికి, మరోవైపు బసవతారకం హాస్పిటల్ ద్వారా వైద్య రంగానికి సేవ చేస్తున్న బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. బాలకృష్ణతో పాటు పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారందరికీ తన అభినందనలు తెలిపారు.