Site icon NTV Telugu

CM Chandrababu: కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే!

Cm Chandrababu

Cm Chandrababu

కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికపై మాట్లాడారు.

‘ఈ రోజు మే డే. ఈరోజున కార్మికులు, కష్టజీవులు గుర్తుకొస్తారు. కార్మికులను దోపిడీ చేనేకుండా అనునిత్యం వారి తరఫున పోరాడి వారికి న్యాయం చేయడానికి పునరంకితమవుతాం. మన రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు. ఇందులో వ్యవసాయంపై ఆధారపడిన వారే అధికం. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోంది. భవన నిర్మాణరంగంలో మహిళా కార్మికులే అధికంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలో కార్మికుల కోసం చక్రాన్ని పెట్టారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతున్నాం. కేంద్ర రాష్ట్రాలలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. దీని వల్ల సులభంగా ఇసుక దొరుకుతోంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే లక్షా 2 వేల కోట్లు అప్పు తెచ్చినా..

‘నిర్మాణ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని కూడా రద్దు చేశా. భవనాల నిర్మాణ అనుమతులలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ పార్కులలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన భూముల సమీకరణకు రైతులు సహకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు జాతికి రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. అమరావతిలో 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చు లేకుండా రాజధానిని నిర్మిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Exit mobile version