NTV Telugu Site icon

Bhatti Vikramarka: కాంగ్రెస్‌దే అధికారం.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: రేపు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో మరిన్ని కీలకాంశాలు ఉండబోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్లకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఆదాయం పెంపు.. పెరిగిన సంపద ద్వారా పేదలకు సంక్షేమం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి దిశగా ప్రణాళికలు రచించేది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండడం వల్లే ఇరిగేషన్ ప్రాజెక్టులు.. పవర్ ప్రాజెక్టులు నిర్మించామన్నారు. తెలంగాణలో పారే నీళ్లు.. వచ్చే వెలుగులన్నీ మేం కట్టిన ప్రాజెక్టుల వల్లే జరుగుతోందన్నారు. కేసీఆర్ వచ్చాక కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి వంటి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులను మాత్రమే టేకప్ చేశారన్నారు.

Also Read: BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

కాళేశ్వరం కుంగిపోయింది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్లే లేవన్నారు. యాదాద్రి, భద్రాద్రి వంటి పవర్ ప్రాజెక్టులని టేకప్ చేస్తే.. భద్రాద్రి మాత్రం ట్రయల్‌ రన్ నడుస్తోందన్నారు. అందుకే తెలంగాణలో పారే నీళ్లు.. వెలిగే వెలుగులన్నీ కాంగ్రెస్ చొరవ వల్లే జరిగిందన్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. తానే చేశానని కేసీఆర్ చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత కూలీ పనులకెళ్లే దుస్థితిలోకి కేసీఆర్ రాష్ట్రాన్ని నెట్టారని తీవ్రంగా మండిపడ్డారు భట్టి విక్రమార్క. బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్లు కూలీ పనులకెళ్లడం తెలంగాణ సమాజానికే అవమానమన్నారు.

Also Read: BJP Manifesto: ఎల్లుండి అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే ఛాన్స్

కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది.. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో ఇచ్చాం.. కానీ కేసీఆర్ రూ. 5 లక్షల అప్పులు తెచ్చారన్నారు. సంపదను కొద్ది ఫ్యూడల్సుకు పంచాలనేది కేసీఆర్ ఆలోచన అని ఆయన ఆరోపించారు. ఆస్తుల కల్పన.. సంపద సృష్టి దిశగా కేసీఆర్ ఆలోచనే లేదన్నారు. మధిరలో అగ్రో బేస్డ్ కంపెనీలు తెస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. అమూల్ తరహాలో పాడి రైతుల కోసం మహిళా సమాఖ్యల నేతృత్వంలో ప్రాజెక్టు మధిరకు తెస్తామన్నారు.