NTV Telugu Site icon

Bhatti Vikramarka: మత కల్లోలం సృష్టించేందుకే బీజేపీ కుట్రలు

Clp Leader

Clp Leader

Bhatti Vikramarka: ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై అమిత్‌ షా చేసిన కామెంట్స్ వల్ల మతకల్లోలానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బాధ్యతలు స్వీకరించిన పెద్దలు ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరమన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌ నుంచి హన్మకొండ వరకు సాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్రలో అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే. రైతులకు ఈ నష్టం జరిగేది కాదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తాం అంటున్నారు కానీ ఇప్పటికీ క్షేత్ర స్థాయికి అధికారులు రాలేదని ఆయన మండిపడ్డారు. మక్కలకు గుట్టు బాటు ధర ఇవ్వడం లేదని.. మార్క్‌ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుందన్నారు.

రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఇచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు తొలగిస్తా అని చెప్పిన కేంద్ర మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలకు పరోక్షంగా సీఎం మద్దతు ఇస్తున్నారని భట్టి ఆరోపించారు. ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెబుతున్నారు.. మీరు కొత్తగా ఇచ్చేది ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ చాలా రోజులుగా బీసీల జనగణన చేయమని చెబుతున్నా చేయట్లేదని.. అది చేయకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్నారు. జనగణన జరగకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించి ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు అన్నది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సర్వోన్నత న్యాయస్థానం అలా అనలేదన్నారు.

Read Also: Governor Tamilisai: పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం.. ఆ బిల్లును తిరస్కరించిన తమిళిసై

బీసీలకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. జనగణన చేయకుండా రెండు పార్టీలు నాటకం అడుతున్నాయన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ స్నేహభావంతో అందరిని కలుపుకొని పోయేలా చూసుకుంటూ వచ్చిందని.. ఇలా ప్రశాంతంగా ఉన్న భారతదేశంతో పాటు తెలంగాణలో అల్లకల్లోలం చేసేలా కుట్ర చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీ పార్టీకి లొంగిపోయారని ఆయన ఆరోపణలు చేశారు. అవినీతి పైనా చర్యలు తీసికుంటామని చెప్పిన బీజేపీ పెద్దలు అవినీతికి పాల్పడ్డ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు మధ్య లాలూచీ లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ పెద్దలు సూత్రధారులు అని.. బండి సంజయ్ లాంటి పాత్రధారులు అని ఆయన విమర్శించారు. ఈ ఆటలను సాగనివ్వమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.