Muslim Population: భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇదే సమయంలో హిందూ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ విషయం ఊరకే చెప్పట్లేదు. ఇది లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయంలో ఈ విషయం వెల్లడైంది. ముస్లిం జనాభా పెరుగుదలకు కారణాలు అనేకం ఉండొచ్చు. ఈ పెరుగుదల మాత్రం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన మొదటి దేశంగా ఇండోనేషియా ఉంది. అత్యధిక ముస్లిం జనాభా…
ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన కామెంట్స్ వల్ల మతకల్లోలానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆధారంగా రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటు వేయడంపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను ప్రజలు క్షమించరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పేర్కొన్నారు. కౌశాంబి మహోత్సవ్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల సర్వతోముఖ సంక్షేమం కోసం 2024లో మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.