Maharashtra: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఆశ్చర్యకరంగా వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా ఏకపక్షంగా బీజేపీ కూటమి(ఎన్డీయే) విజయం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం, 543 స్థానాల్లో బీజేపీ కూటమి 300కిపైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అయితే, ఎంతో కీలకంగా భావించిన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రల్లో మాత్రం ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీని ఇస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికల తర్వాత అనూహ్య ఫలితాలు ఎదురవుతున్నాయి.
Read Also: Lok Sabha Results 2024: కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్
మొత్తం 48 స్థానాల్లో ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 28 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 18 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యత మారుతూ కనిపిస్తోంది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత శివసేన, ఎన్సీపీల్లో చీలిక వచ్చిన తర్వాత, ఈ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఈ రాష్ట్రం నుంచి బీజేపీ 23 సీట్లు గెలుచుకోగా, అప్పటి శివసేన( అవిభజిత) 18 సీట్లు గెలుచుకుంది. అవిభక్త ఎన్సీపీ 04, కాంగ్రెస్ ఒక స్థానానికే పరిమితమైంది.