AP Crime: వైన్స్‌ దగ్గర గొడవ.. ఒకరి హత్య

  • పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ
  • పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40).. దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం
  • భాస్కరరావు చాతీ భాగంలో గాజుపెంకుతో పొడిచిన రామకృష్ణ
  • అపస్మారక స్థితికి చేరుకున్నాడు భాస్కరరావు.. చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతి
Crime

Crime

AP Crime: బాగా మద్యం సేవించిన తర్వాత.. రకరకాల గొడవలు జరుగుతుంటాయి.. కొన్నిసార్లు అవి చిలికిచిలికి గాలివానగా మారుతుంటాయి.. మరికొన్నిసార్లు.. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా.. దాడులు, ప్రతిదాడులు.. హత్యలు జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఇలాంటి ఘటనే జరిగింది.. మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా.. ఒకరు హత్యకు గురయ్యారు.. తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది..

Read Also: Tamilisai: అమిత్ షాతో సంభాషణపై తమిళిసై వివరణ

పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య.. దువ్వలోని ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర తీవ్ర వాగ్వాదం జరిగింది.. అయితే, గొడవ ఎందుకేలే అని.. కాస్త వెనక్కి తగ్గిన భాస్కరరావు.. మోటారుసైకిల్‌పై వెళ్లిపోతుండగా.. అతడిపై గాజుపెంకుతో చాతీ భాగంలో పొడిచాడు రామకృష్ణ అనే వ్యక్తి.. ఇక, అలాగే బండిపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు భాస్కరరావు.. ఆ తర్వాత చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతిచెందాడు.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన తణుకు రూరల్‌ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై కె.చంద్రశేఖర్‌.. కేసు నమోదు చేసి నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..