హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు రచ్చకెక్కింది. జనగామ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ జంగా తీరుపై హనుమకొండ డీసీసీ నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగా రాఘవరెడ్డి జనగామ జిల్లా అధ్యక్షుడు కాదని, పార్టీ కార్యక్రమాలు చూసుకోమని అధిష్టానం చెప్పిందన్నారు. ప్రతిపక్షాల లాభం కోసం జంగా పనిచేస్తున్నాడంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. వినయ్ భాస్కర్ తో కలిసి నాకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వేయించాడని, జిల్లా అధ్యక్షుల అనుమతి లేకుండా ఎవరూ పార్టీ కార్యక్రమాలు చేయొద్దని ఆయన వెల్లడించారు.
Also Read : Puvvada Ajay Kumar : స్లీపర్ ఎసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
నా అనుమతి లేకుండా హనుమకొండ జిల్లాలో పార్టీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడని, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా టికెట్ తనకే అంటూ ప్రచారం చేస్తున్నాడన్నారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని, జంగాకు అధిష్టానం షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసిందని ఆయన వెల్లడించారు. జంగా తీరుతో కాంగ్రెస్ పార్టీ నష్టపోతోందని, జంగా రాఘవరెడ్డి పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడన్నారు. జంగా రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తున్నామని, తీర్మానం కాపీని అధిష్టానానికి పంపించామన్నారు. అధిష్టానం సరైన చర్యలు తీసుకోకుంటే నా కార్యాచరణ ప్రకటిస్తామని డీసీసీ రాజేందర్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Royal Enfield Powerful Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ‘‘పవర్’’ఫుల్ బైక్