NTV Telugu Site icon

BJP-Congress: బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరిన యూత్ కాంగ్రెస్.. కార్యకర్తల మధ్య ఘర్షణ

Bjp Congress

Bjp Congress

బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్‌ నాయకులపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ వరకు ఎలా రానిచ్చారు అని ప్రశ్నించింది. కాగా.. బీజేపీ సీనియర్ నేత రమేష్‌ బిదూరి.. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చింది. ఇక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది.

READ MORE: Yuvaraj Singh: గతంలో నేనెప్పుడూ చూడలేదు.. కోహ్లీ, రోహిత్‌లు అద్భుతం: యువీ

ఇదిలా ఉండగా.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల మధ్య మాటలు హద్దు మీరుతున్నాయి. ఇటీవల ఢిల్లీ బీజేపీ సీనియర్‌ నేత రమేష్‌ బిదూరి వయనాడ్ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనను అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించింది. అయితే, బిదూరి తాజాగా మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని హాట్ కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు.

READ MORE: Formula E Car Race Case : బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చలు

ఇక, ఈ విషయంపై మీడియా బీజేపీ నేత రమేష్ బిదూరిని ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనంటూ ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా హీరోయిన్‌ హేమమాలినిపై ఇలాంటి కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. లాలూ చేసింది తప్పయితే తనది కూడా తప్పేనని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నిజానికి ప్రియాంక గాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని రమేష్ బిదూరి గుర్తు చేశారు.

 

Show comments