Russian Prison: రష్యన్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. 8 మంది మృతి
- రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ
- ఘర్షణలో ఎనిమిది మంది మృతి
- వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు
- వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో హింసాకాండ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు కూడా ఉన్నారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో ఈ హింసాకాండ చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. కొంతమంది ఖైదీలు హింసాత్మకంగా తిరుగుబాటు చేశారు. కత్తులు పట్టుకుని.. తాము ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించినవారంటూ హల్చల్ చేశారు. అంతేకాకుండా.. కొంతమంది ఖైదీలను బెదిరిస్తూ.. జైలులో కొంత భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముస్లింలపై అణచివేతకు ప్రతీకారం తీర్చుకునేందుకే దాడి చేశామంటూ వారు పేర్కొన్నారు.
Read Also: Noida Encounter: నోయిడాలో కాల్పుల మోత.. ఇద్దరు నేరస్తులపై ఎన్‌కౌంటర్
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఒక సాధారణ క్రమశిక్షణ సమావేశం నిర్వహించాల్సిన సమయంలో ఈ ఘర్షణ తలెత్తిందని ఒక నివేదిక పేర్కొంది. ఈ సమావేశం జరుగుతుండగా.. రామ్‌జిడిన్ తోషోవ్ (28), రుస్తమ్‌చోన్ నవ్రూజీ (23), నజిర్చోన్ తోషోవ్ (28), తైమూర్ ఖుసినోవ్ (29) అనే ఖైదీల బృందం దాడులకు దిగింది. ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్‌లకు చెందిన నలుగురు వ్యక్తులు కత్తులతో గార్డులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అలాగే ఎనిమిది మంది జైలు సిబ్బంది.. నలుగురు తోటి ఖైదీలను బందీలుగా తీసుకుని దాడి చేశారు.
Read Also: Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు
కాగా.. ఈ ఘర్షణకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో.. రక్తంతో తడిసిన జైలు గార్డుపై ఒక ఖైదీ కత్తిని పట్టుకోవడం కనిపిస్తుంది. మరో వీడియోలో జైలు యార్డ్‌లో దాడి చేసిన వారిని చూపిస్తుంది. ఇక్కడ ఒక ఖైదీ ముఖమంతా రక్తంతో తడిసి పోయింది. అంతేకాకుండా.. ఆ వీడియోలో దాడి చేసిన వారు ఐసిస్‌కు తమ విధేయతగా ప్రతిజ్ఞ చేశారు. ముస్లింలను హింసించినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారడంతో.. సాయుధ ప్రత్యేక రష్యన్ దళాలు, స్నిపర్లు మోహరించారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!