చప్పట్లు పేరు వినగానే అందరికి స్కూల్ రోజులు గుర్తుకు వస్తుంది.. ప్రతి పనికి చప్పట్లతో ప్రారంభించవచ్చు.. చప్పట్లు ఎదుట వ్యక్తిని సంతోష పరచడమే కాదు.. మన ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చప్పట్లు కొట్టడానికి శారీరక శ్రమ అవసరం లేదు. రోజుకు 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీ మార్నింగ్ ఎక్సఅర్‌సైజ్ రొటీన్‌లో క్లాపింగ్ థెరపీని పాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ చప్పట్లు కొట్టడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మన శరీరంలోని 300 కంటే ఎక్కువ ఆక్యుప్రెషర్ పాయింట్లలో, 30 కంటే ఎక్కువ చేతులపైనే ఉన్నాయి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్లకుమన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, జీర్ణవ్యవస్థతో సంబంధం ఉంటుంది. ఈ పాయింట్లను యాక్టివేట్ చేయడం వల్ల ఆ భాగాలను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. రోజూ 10 నుంచి15 నిమిషాలు చప్పట్లు కొడితే శరీరంలో ఉన్న ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.. చప్పట్ల తో అవి యాక్టివ్ అవుతాయి..
ఈ చప్పట్లు కొట్టడం వల్ల రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనం చప్పట్లు కొడితే.. అరచేతులు వేడెక్కుతాయి, శరీరమంతా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది, గుండె సమస్యలను నివారిస్తుంది. చప్పట్లు శ్వాసకో సమస్యలను దూరం చేస్తాయి.. అదే విధంగా చప్పట్లు శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..చప్పట్లు కొట్టడం వల్ల పిల్లల్లో జ్ఞాన సామర్థ్యాలు పెరగడంతో పాటు.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇక మనం చప్పట్లు కొట్టినప్పుడు.. తుంటి కండరాలకు అనుసంధానంగా ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్లను స్టిమ్యూలేట్ చేస్తుంది. ఇది నొప్పి తీవ్రతను తగ్గిస్తుందట..ఇది జుట్టు కుదుళ్లలో రక్త ప్రవాహాన్ని కూడా ప్రేరేపిస్తుంది. జుట్టు రాలే సమస్యను దూరం చేసి.. హెయిర్ గ్రోత్‌ను ప్రేరేపిస్తుంది.. అదే పనిగా కాకుండా మాములుగా కొట్టిన కూడా మంచిది.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ చప్పట్లను మీరు ఒకసారి కోట్టి చూడండి మీకే తెలుస్తుంది..