NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NSUI Protest: ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) త్రివర్ణ పతాక ప్రదర్శనకు ముందు గురువారం రాత్రి రాజకీయ, పోలీసు వర్గాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నాట్ ప్లేస్‌లో ఇవాళ జరగాల్సిన ‘లహరా దో తిరంగా’ మార్చ్‌ను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు భారీగా భద్రతను పెంచారు. మరోవైపు, మహిళా కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తూ, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు రాత్రికి రాత్రే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వినోద్ జాఖడ్ సహా పలువురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
ఢిల్లీ పోలీసు విభాగంలోని ఓ మహిళా అధికారి తమ సంఘానికి చెందిన మహిళా కార్యకర్తలపై చేయి చేసుకున్నారని, ఆమెపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేస్తోంది. బుధవారం నాడు అదనపు డీసీపీ స్థాయి అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే తాము స్టేషన్ ఎదుట బైఠాయించాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు తమపైనే ఎదురుదాడికి దిగి అణచివేత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా కార్యకర్తలపై భౌతిక దాడి జరిగిందని, కొందరిని చీకటి గదిలోకి తీసుకెళ్లి బూట్లతో దారుణంగా కొట్టారని వినోద్ జాఖడ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాము కేవలం చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మాత్రమే కోరామని, అధికారులు తమ గోడును అసలు పట్టించుకోలేదని వాపోయారు. మహిళా కార్యకర్తలకు న్యాయం చేయమని కోరడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
- Crazy Kalyanam: క్రేజీ కళ్యాణం రివ్యూ..
- Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
- డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
ఇక మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నేడు సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాలతో భారీగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలనే డిమాండ్లతో ఈ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ఎవరూ ఈ నిరసన మార్చ్‌లో పాల్గొనవద్దని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 ప్రకారం ఆ ప్రాంతంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే, అడ్మినిస్ట్రేటివ్ కారణాలరీత్యా అక్టోబర్ 16, 17 తేదీల్లో సెంట్రల్ పార్క్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎన్డీఎంసీ ప్రకటించింది. పోలీసులు తనను గురువారం రాత్రే లేదా ఇవాళ ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉందని, దేశం కోసం, జెండా ఎగరేయడం కోసం జైలుకెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అభిజిత్ దిప్కే గురువారం అర్ధరాత్రి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. పోలీసులు, నిఘా వర్గాలు తన కదలికలను నిరంతరం గమనిస్తున్నాయని ఆరోపించారు.
दिल्ली पुलिस की बर्बरता की हद देखिए! NSUI के राष्ट्रीय अध्यक्ष विनोद जाखड़ जी को जिस तरह जबरन घेरकर ले जाया जा रहा है, उसमें उनकी शर्ट से उनका गला दबने जैसी गंभीर स्थिति पैदा हो गई है।
अगर कल को विनोद जाखड़ जी के साथ कोई अनहोनी होती है, तो इसकी पूरी जिम्मेदारी दिल्ली पुलिस की होगी।
याद रखिए, यह लड़ाई सिर्फ़ FIR दर्ज करवाने की नहीं, बल्कि हमारे साथियों को न्याय दिलाने की है। कितनी भी बर्बरता कर लो, हमारा सत्याग्रह और संघर्ष रुकने वाला नहीं है। FIR दर्ज करवाकर और अपने साथियों को न्याय दिलाकर ही दम लेंगे! ✊🏽🔥
#NSUI #JusticeForStudents #Satyagraha
— NSUI (@nsui) October 15, 2026
తాజావార్తలు
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
ట్రెండింగ్
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..