పలువురు న్యాయవాదులు తాజాగా మన దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని వత్తిళ్లు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రముఖ లాయర్లు ఈ మేరకు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ లతో సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడకు ఓ లేఖ రాశారు.
Also Read: Premalu: తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మలయాళం మూవీ..!
దింతో ప్రస్తుత్తం జరగబోయే లోక్ సభ ఎన్నికల వేళ ఇది చర్చనీయాంశంగా మారింది. స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్లు పొలిటికల్ అజెండాతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. మరికొందరైతే ఏకంగా న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేస్తూ, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అలంటి వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారని.. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పుల పై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని తెలుపుతున్నారు.
Also Read:Viral Murder: తన నేరాన్ని దాచడానికి సొంత సోదరిని చంపిన కిరాతక అన్న..!
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థిచడం, మల్లి అదే రోజు రాత్రి మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేయడం లాంటి అంశాలు బాధాకరం అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆపై వారినే కోర్టుల్లో సమర్థించడం చాలా వింతగా ఉందని.. ఒకవేల ఆ సమయంలో కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నట్లు లాయర్లు వాపోయారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నట్లు న్యాయవాదులు తమ లేఖలో కారడం జరిగింది.