NTV Telugu Site icon

Civil Supply Inspections : బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు..

Cmr Rice

Cmr Rice

Civil Supply Inspections : నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్‌ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లారు మహేష్ నాయుడు. సమాచారం తెలిసి అప్పటికే గోడౌన్ నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 వరకు వేచి వుండి తాళాలు తెప్పించి డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. సిబ్బంది రికార్డులు మాయం చేసినట్లు సమాచారం. బియ్యమే బస్తాలు స్వయంగా కౌంట్ చేసిన మహేష్ నాయుడు.. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో 398 బియ్యం బస్తాలు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. మరో ప్రైవేట్ గోదాములో 685 బస్తాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. బియ్యం స్టాక్ పై జిల్లా మేనేజర్ ను రికార్డులు అడిగిన మహేష్.. ఇప్పటి వరకు రికార్డులు జిల్లా మేనేజర్ ఇవ్వలేదని సమాచారం.

PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..

ఈ విషయంపై సివిల్ సప్లై ఎండికి, జాయింట్ కలెక్టర్ కు డైరెక్టర్ సమాచారం ఇచ్చారు. 1300 బస్తాలు రేషన్ బియ్యం మాయం అయ్యాయని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీలపై రెవెన్యూ అధికారులు నోరు మేదపడం లేదు. రికార్డులు సరిగాలేవని డైరెక్టర్ తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. ప్రతిరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు చేయాల్సిన అధికారులు.. అక్రమాలు వెంటనే బయటపడే అవకాశం వున్నా అధికారుల మౌనంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోనసీమ నుంచి బేతంచెర్ల గోదాములకు, పాలకొన్లు నుంచి నంద్యాల గోదాములకు రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే బేతంచెర్ల కు పాలకొల్లు నుంచి నిన్న బియ్యం సరఫరా అయ్యింది. అక్రమాలు బయట పడతాయని అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. బేతంచెర్ల గోదాముల్లో ఒకటి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందినదిగా అధికారులు చెబుతున్నారు.

Manchu Vishnu : సీఎంతో మీటింగుకు ‘మా’ ప్రెసిడెంట్ గైర్హాజరు.. ఆయన రాకపోవడానికి కారణం ఇదేనా ?

Show comments