Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఎన్నికల విరాళాలు స్వీకరించడానికి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చట్టబద్ధతను సమర్థించారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు లేదన్నారు.
Also Read: Maratha Reservation: మరాఠా కోటా వివాదం.. ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు, అజిత్ పవార్ పోస్టర్ ధ్వంసం
అటార్నీ జనరల్ కోర్టులో నాలుగు పేజీల లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎలక్టో బాండ్ స్కీమ్‌లో దాత గోప్యతకు సంబంధించిన ప్రయోజనాన్ని పొందుతారని ఆయన నొక్కి చెప్పారు. ‘ఎలక్టోరేట్ బాండ్ పథకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) పరిధిలో ఉందని, ప్రాథమిక హక్కుల సాధనపై ప్రభుత్వం సహేతుకమైన ఆంక్షలు విధించేందుకు వీలు కల్పిస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత కోసం పిటిషనర్లు లేవనెత్తిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ వ్యతిరేకించారు. కొన్ని ప్రయోజనాల కోసం భావవ్యక్తీకరణకు తెలుసుకునే హక్కు అవసరమని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అన్నారు. రాజ్యాంగం ప్రకారం అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అయితే ప్రతీది తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి పేర్కొన్నారు.
Also Read: Extra – Ordinary Man Teaser: కలిపి చదువు నాన్న.. చెత్త.. కొడుకు.. చెత్త నా కొడుకు
అక్టోబర్ 16న, ఎలక్టో బాండ్ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిఫర్ చేసింది. ఈ పిటిషన్‌కు ఉన్న ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిర్ణయం కోసం రాజ్యాంగ ధర్మాసనానికి పంపింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను అక్టోబర్ 31న విచారించనుంది. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి పంపాలని పిటిషనర్లు కోరారు. ఈ అంశానికి రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత ఉందని, ఇది ప్రజాస్వామ్య రాజకీయాలను, దేశంలోని రాజకీయ పార్టీల నిధులను ప్రభావితం చేస్తుందని పిటిషన్‌లో పేర్కొంది.