PM Modi: పశ్చిమ బెంగాల్ మాల్దాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) , సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. టీఎంసీ ప్రభుత్వాన్ని మార్చాలని అవసరం ఉందని అన్నారు. దయలేని, క్రూరమైన మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల డబ్బును దోచుకుంటోందని, కేంద్ర సహాయాన్ని బెంగాల్ ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని ఆయన శనివారం అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ అభివృద్ధికి దోహదపడుతుందని హామీ ఇచ్చారు.
Read Also: Maharashtra Elections: ఒవైసీని తక్కువంచనా వేశారా? మహారాష్ట్రలో “AIMIM” హవా మామూలుగా లేదు!
ఇటీవల, ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. ముంబై ఎన్నికల్లో బీజేపీ మొదటిసారిగా రికార్డ్ విజయం సాధించిందని, బెంగాల్ ఓటర్లు కూడా ఈ సారి బీజేపీని గెలిపిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతదేశపు జెన్ జీ యువత బీజేపీని విశ్వసిస్తోందని ఆయన అన్నారు. తృణమూల్ చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తోందని, వారిని ఓటర్లుగా ఉపయోగించుకుంటోందని ప్రధాని ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి ప్రస్తావిస్తూ.. మతువాలు, పొరుగు దేశం నుంచి హింసకు గురై భారత్ వచ్చని శరణార్థులు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని హామీ ఇచ్చారు.