Anakapalle Land Pooling: అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాలు.. దూకుడు పెంచిన సీఐడీ !
- అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాలపై సీఐడీ దూకుడు
- రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనున్న సీఐడీ
- తహసీల్దార్ కార్యాలయం నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇంటి స్థలాల కోసం గత ప్రభుత్వ హయాంలో డి-ఫారం పట్టా, ఆక్రమిత భూములను సమీకరణపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనుంది. ఇప్పటికే అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ముఖ్య డాక్యుమెంట్లు, రికార్డులను సీఐడీ స్వాధీనం చేసుకుంది.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ ఎమ్మెల్యేగా వున్న సమయంలో జరిగిన భూసమీకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. భూ సమీకరణలో కీలకమైన అప్పటి వీఆర్వోలు, తహసీల్దార్ల నుంచి సీఐడీ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. కొనసాగింపుగా రెవెన్యూ సిబ్బందిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. అనకాపల్లి మండలంలోని 11 గ్రామాలలో 1,050 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో సమీకరించారు. అయితే ల్యాండ్ పూలింగ్‌కు ముందే వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, డీఫారం పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధి పొందారనేది కంప్లయింట్ ఉంది.
Also Read
Also Read: CM Chandrababu: కుప్పంలో మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!
ప్రాధాన్యం లేని చోట స్థలాలు ఇచ్చారంటూ కోడూరు, గొలగాం, కుంచంగి, వేటజంగాలపాలెం గ్రామాల్లోని జనాలు తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. 2020 నుంచి 2023 మధ్య జరిగిన ఈ భూసమీకరణ అక్రమాలపై విచారణ జరపాలని అప్పుడే స్థానిక టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాజాగా ఈ వ్యవహారంపై విచారణ ప్రక్రియను సీఐడీ వేగవంతం చేసింది.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!