NTV Telugu Site icon

ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ముగిసిన సీఐడీ విచారణ

Icici

Icici

ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలతో ఫైనాన్స్ సంస్థ, ట్రేడింగ్ సంస్థలను ఏర్పాటు చేసి పెట్టుబడి పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. స్కాంలో పాత్రధారులుగా ఉన్న ప్రభు శేఖర్, అజిత్ సింగ్ సహా మరికొందరి పాత్రపై సీఐడీ ఆధారాలు సేకరిస్తోంది.

Read Also: AP Weather: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు హైఅలర్ట్

చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంకి బెజవాడలో లింకులపై సీఐడీ ఫోకస్ పెట్టగా.. స్కాంలో బ్యాంక్ మాజీ ఉద్యోగి నరేష్‌కు ప్రభుశేఖర్ సహకరించినట్టు గుర్తించారు. నరేష్ ఆర్థిక సాయంతో ప్రభుశేఖర్ నరజ ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక లావాదేవీలు భారీగా చేసినట్టు సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. దీంతో పాటు అక్లాస్ అనే సంస్థకు కూడా పెట్టుబడి పెట్టినట్టు ఆధారాలు సేకరిస్తున్నారు. స్కాంలో కీలక పాత్ర పోషించిన నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్, స్టానికుడైన రాజేష్ వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుశేఖర్‌ను వారం క్రితం ఒక కేసులో హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు సీఐడీ గుర్తించింది. బెజవాడలో పలువురు కస్టమర్ల నుంచి ఇదే విధంగా చేసినట్టు గుర్తించింది. ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతీనగర్‌ ఐసీఐసీఐ బ్రాంచ్‌లలో మోసపోయిన ఖాతాదారులకు ఊరట లభించింది. బాధిత ఖాతాదారులకు అధికారులు నగదును వెనక్కి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్‌ ఖాతాదారులను మోసం చేశాడని బ్యాంక్‌ ఉన్నతాధికారులు నిర్ధారించారు. అతను పనిచేసిన కాలంలో వివిధ శాఖల్లో కలిపి మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కాజేసినట్లు గుర్తించారు.