ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ముగిసిన సీఐడీ విచారణ
- బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ముగిసిన సీఐడీ విచారణ
- బ్యాంక్ మేనేజర్ నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలతో ఫైనాన్స్ సంస్థ, ట్రేడింగ్ సంస్థలను ఏర్పాటు చేసి పెట్టుబడి పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. స్కాంలో పాత్రధారులుగా ఉన్న ప్రభు శేఖర్, అజిత్ సింగ్ సహా మరికొందరి పాత్రపై సీఐడీ ఆధారాలు సేకరిస్తోంది.
Read Also: AP Weather: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు హైఅలర్ట్
Also Read
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంకి బెజవాడలో లింకులపై సీఐడీ ఫోకస్ పెట్టగా.. స్కాంలో బ్యాంక్ మాజీ ఉద్యోగి నరేష్‌కు ప్రభుశేఖర్ సహకరించినట్టు గుర్తించారు. నరేష్ ఆర్థిక సాయంతో ప్రభుశేఖర్ నరజ ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక లావాదేవీలు భారీగా చేసినట్టు సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. దీంతో పాటు అక్లాస్ అనే సంస్థకు కూడా పెట్టుబడి పెట్టినట్టు ఆధారాలు సేకరిస్తున్నారు. స్కాంలో కీలక పాత్ర పోషించిన నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్, స్టానికుడైన రాజేష్ వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుశేఖర్ను వారం క్రితం ఒక కేసులో హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు సీఐడీ గుర్తించింది. బెజవాడలో పలువురు కస్టమర్ల నుంచి ఇదే విధంగా చేసినట్టు గుర్తించింది. ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ ఐసీఐసీఐ బ్రాంచ్‌లలో మోసపోయిన ఖాతాదారులకు ఊరట లభించింది. బాధిత ఖాతాదారులకు అధికారులు నగదును వెనక్కి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్ ఖాతాదారులను మోసం చేశాడని బ్యాంక్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. అతను పనిచేసిన కాలంలో వివిధ శాఖల్లో కలిపి మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కాజేసినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?