రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ అధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ క్రిస్టోఫర్ తిలక్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షులు దోమ్మటి సాంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ క్రిస్టోఫర్ తిలక్ మాట్లాడుతూ.. మేము కరీంనగర్ లోక సభ పరిధిలో ఎన్నికల వర్క్ ప్రారంభం చేశామన్నారు.
Also Read : CWC: సీడబ్ల్యూసీలో ఏపీకి చెందిన రఘువీరారెడ్డికి చోటు
తొలుత వేములవాడ నుండి స్టార్ట్ చేశామని ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో హామీలు కానీ హామీలు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని ఆయన అన్నారు. మళ్ళీ ఎన్నికల్లో మోసం చేస్నేదుకు వస్తారని, ఎవరు నమ్మవద్దని, మోస పూరిత మాటలు, మభ్య పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదన్నారు తిలక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు..కానీ ఏమీ చేయలేదని, బీఅర్ఎస్ సర్కార్ మాటలకే పరిమితం అయిందని, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీలో ఉంటు పరిపాలన చేస్తుండు.. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. దేశంలో వేములవాడ లాంటి ఎమ్మెల్యే ను ఎక్కడ చూడలేదని, రాహుల్ గాందీ భారత్ జొడో యాత్ర కాంగ్రెస్ పార్టీ మైలేజి పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రజలు బీఅర్ఎస్ పార్టీ నీ చేంజ్ చేయాలని కోరుకుంటున్నారన్నారు.
Also Read : Luna 25: రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. చంద్రునిపై కుప్పకూలిన లూనా 25