Site icon NTV Telugu

Chittoor: చిత్తూరులో వైసీపీకి భారీ షాక్

Chittoor

Chittoor

Chittoor: చిత్తూరులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP)కి భారీ షాక్‌ తగిలింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిత్తూరు మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు.. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్‌ బాటలో పలు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు.. దీంతో.. వైసీపీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ప్రస్తుతం సంఖ్యాబలాలు వైసీపీ -46, టీడీపీ -3, స్వతంత్ర – 1 ఉండగా.. తాజా చేరికలతో ఆ లెక్కలు మారిపోయాయి.. అయితే, ఈ రోజు చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం జరగాల్సి ఉంది.. ఆ సమావేశానికి ముందే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ మార్పులు జరుగుతున్నాయి.. పలు మున్సిపాల్టీలో.. మేయర్లు, కార్పొరేటర్లు కూడా కొందరు అధికార టీడీపీలో చేరుతున్నారు.. కూటమి ప్రభుత్వానికి చేరువ అవుతున్నారు.

Read Also: Rahul Gandhi : హత్రాస్ ప్రమాదానికి ఎవరు బాధ్యులు.. రాహుల్ భోలే బాబా గురించి ఏం చెప్పారంటే ?

Exit mobile version