Chit Fund Scam: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chit Fund Scam: సామాన్య పేద ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్స్‌ను టార్గెట్‌గా చేసుకుని చిట్టీల పేరుతో చేసిన మోసం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. సింగరాయకొండలో నమ్మి చిట్టీలు కట్టిన బాధితుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుడు కాకుమాను శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఉడాయించటంతో ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవటంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ ALSO: HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
Also Read
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
గత పదేళ్లుగా స్థానికంగా ప్రొవిజన్స్ షాపును నిర్వహించే శ్రీనివాసరావు సామాన్య పేదలు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్‌గా చేసుకున్నాడు. 50కి పైగా వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో చిట్టీల పేరుతో వసూలు చేశాడు. రూ. 10 కోట్లకు పైగా నగదు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. శ్రీనివాసరావు నివసిస్తున్న మూలగుంటపాడు, విద్యానగర్ ఏరియాలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని చిట్టీలు కట్టించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత .. గత 6 నెలల నుంచి చిట్టీలకు సంబంధించిన అమౌంట్ చీటీదారులకు చెల్లించటం లేదు. అతని దగ్గర చిట్టీలు కట్టి పాడిన వ్యక్తులు తమ డబ్బు కోసం ఫోన్లు చేయటంతో స్పందించలేదు. శ్రీనివాసరావు నగదు చెల్లించకుండా, ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాధితులకు షాక్ తగిలింది. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాసరావు తన ఇంటిని సైతం అమ్ముకొని పరారయ్యాడని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద 1. 72 కోట్ల రూపాయలు చీటీల రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ నెల చిట్టీలు కట్టిన సభ్యులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు తప్పించుకుని పరారయ్యాడని వాపోతున్నారు. ఆయన దగ్గర దాదాపుగా రూ. 10 కోట్లకు పైగా చిట్స్ వ్యాపారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు చిట్టీలు, ఫైనాన్స్ పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సింగరాయకొండలో జరిగిన ఈ భారీ మోసం ఇంకా ఎన్ని కుటుంబాలను దెబ్బతీసిందో పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది.
READ ALSO: Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
తాజావార్తలు
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!