NTV Telugu Site icon

Chiranjeevi : నాకు నచ్చితేనే చేస్తాను.. నాకు నచ్చితేనే చూస్తాను..

Bholaa Shankar

Bholaa Shankar

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సినిమా భోళా శంకర్‌. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా… చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అయితే.. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ చిత్ర వేదళం సినిమాకు రిమేక్‌గా తెరకెక్కించారు. విడుదలకు సిద్ధమవుతున్న భోళా శంకర్‌ సినిమా కోసం నేడు హైదరాబాద్‌ శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ ప్రేమ ఎలాగైతే బోర్‌ కొట్టదో అలాగే అభిమానుల ప్రేమ కూడా బోర్‌ కొట్టదన్నారు.

Also Read : Explosion: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు.. కార్మికుడు దుర్మరణం

ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పినా.. కొత్తగానే ఉంటుందన్నారు. సినిమాలోనే కాకుండా.. ఏ సాంఘీక, సంక్షేమ కార్యక్రమం చేసినా నాఫ్యాన్స్‌ గర్వపడేలా ఉండాలనే.. ఎన్నో విషయాలను నాలో మార్చుకున్నానని చిరు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఖైదీ నెంబర్‌ 150 సినిమాలో చెప్పిన డైలాగ్‌లా ‘నాకు నచ్చితేనే చేస్తాను.. నాకు నచ్చితేనే చూస్తాను..’ అనే విధంగా.. ఈ సినిమా నచ్చే చేశానని, ఈ సినిమా మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చుతుందని, మీ నుంచి మంచి మార్కులు ఈ సినిమా సంపాదించుకుంటుందని భావిస్తున్నానన్నారు చిరు. కొన్ని సినిమాల్లో నటిస్తుంటే.. ఈ సినిమా ఎలాగొస్తుందో.. అని షూటింగ్‌ టైం టెన్షన్‌ పడుతుంటాం.. కానీ.. భోళా శంకర్‌ సినిమాకు అలాంటి ఏ టెన్షన్‌ మాకు రాలేదు. ఎందుకంటే.. ఈ సినిమా మా దృష్టి సూపర్‌ హిట్‌ అయిపోయిందనే ఫీలింగ్‌ వచ్చేసింది.’ అని చెప్పుకొచ్చారు చిరు.

Also Read : Manipur: మణిపూర్‌ సర్కారుకు ఝలక్.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షం!