మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడిను ప్రశంసిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సెట్స్‌లో స్నేహపూర్వకంగా ఉండే ఆయన స్వభావం, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా ఉంటుంది అని చిరు పేర్కొన్నారు. అనిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, 2026 సంక్రాంతి కోసం థియేటర్లలో రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను అనిల్‌తో, సినిమా బృందంతో పండగగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అనిల్‌తో కలిసి దిగిన ఫొటోలో చిరంజీవి ఆయనకు బోకే అందిస్తూ, కుమార్తె, నిర్మాత సుస్మిత, ప్రొడ్యూసర్ సాహు గారపాటి మరియు ఆయన భార్యతో కలిసి కనిపించారు.
Also Read : Spirit: మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం
చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా, అనిల్ రావిపూడి మార్క్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటర్గా రూపొందుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తారు, ప్రముఖ నటుడు వెంకటేశ్ అతిథి పాత్రలో సందడి చేస్తారు. చిత్రం తొలి పాట ‘మీసాల పిల్ల’ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్‌లో నిలిచింది. లిరికల్ వీడియో యూట్యూబ్‌లో 65 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది, సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతూ ఉంది.