Site icon NTV Telugu

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఖాతాలో మరో అవార్డ్.. అగ్ర నటుడికి అత్యున్నత గౌరవం

Chiranjeevi Ntr National Film Award

Chiranjeevi Ntr National Film Award

Megastar Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ప్రతిష్టాత్మకంగా “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (Gaddar Film Awards) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 ఏడాదికి సంబంధించి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేసింది. భారతీయ సినిమా అభివృద్ధికి విశేషంగా సేవలు అందించిన మహానుభావులకు ఇచ్చే ఈ గౌరవం చిరంజీవికి దక్కడం సినీ ప్రపంచంలో నూతన ఉత్సాహాన్ని తెచ్చింది.

READ MORE: Earthquake: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఇరాన్‌లో భూకంపం.. 4.1గా నమోదు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ చిర స్థాయిగా నిలిచిపోయారు. తెలుగు రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారు. అలాంటి గొప్పి వ్యక్తి అయిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకంగా అందజేసే ఈ గౌరవం దేశవ్యాప్తంగా చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలు చేసిన కళాకారులకు ఇస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని చిరంజీవి అందుకోవడం దశాబ్దాల ప్రయాణానికి వచ్చిన గొప్ప గుర్తింపుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవి తన కెరీర్‌లో చాలా రకాల పాత్రలు పోషించారు. కింది స్థాయి నుంచి వచ్చిన ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీలో నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లాది జనాల ఆదరణ పొందారు. ఈ తరుణంలో చిరంజీవికి వరుసగా గౌరవాలు లభిస్తున్నాయి. గతేడాది దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ లభించింది. అదే సమయంలో తన నటనా జీవితంలో సాధించిన విశేష విజయాలకుగాను గిన్నిస్ ప్రపంచ రికార్డుల నుంచీ గుర్తింపు లభించింది. ఈ రెండు గౌరవాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం రావడం చిరంజీవి కెరీర్‌లో మరొక గొప్ప ఘట్టంగా మారింది. చిరంజీవి సినీ ప్రయాణం కొత్త తరానికి కూడా ప్రేరణగా నిలుస్తోంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని శ్రమతో ఎదిగిన చిరూ కథ ఎంతోమంది యువ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ఇటీవల నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ప్రాంతీయ స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. దర్శకుడు బాబీతో కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు భారీ కల్పిత కథతో తెరకెక్కుతున్న విశ్వంభర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ అవార్డు ప్రకటన విశేషంగా నిలిచింది.

Exit mobile version