‘Mana Shankara Vara Prasad Garu’: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో చిత్రంలోని హై ఎనర్జీ ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు మేకర్స్. ఈ సాంగ్‌తో ప్రపంచమంతా డాన్స్ చేసేలా చేస్తామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
యాక్షన్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స్వాగ్‌తో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్‌లో నటిస్తుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా సందడి చేయనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు భీంస్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఇకపోతే ఈ రోజు జరగబోతున్న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘హుక్ స్టెప్’ సాంగ్ లాంచ్ ఉండటంతో చిరు అభిమానుల హుషారు మామూలుగా లేదు. “ఈ సంక్రాంతి మెగా స్వాగ్‌తో ప్రపంచమంతా డాన్స్ చేయిస్తాం” అంటూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ పోస్టర్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ హాజరుకానున్నారు. గతంలో మెగాస్టార్ హీరోగా సంక్రాంతి బరిలోకి దిగిన ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాను మించి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ‘హుక్ స్టెప్’ పై కూడా అంచనాలు పీక్స్‌కు చేరాయి.
READ ALSO: Arjun Tendulkar Wedding: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్స్..
