Anil Sunkara: టాలీవుడ్‌లో ఒకప్పుడు భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసిన సినిమా ‘ఏజెంట్’. ప్రస్తుతం ఈ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన షాకింగ్ కామెంట్స్ ఈ చిత్రాన్ని మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చేలా చేశాయి. ఇంతకీ ఆయన అంతలా ఈ సినిమాపై చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తాజాగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అఖిల్ ఏజెంట్ సినిమా “బుడాపెస్ట్ షెడ్యూల్ వృథా అయిన తర్వాత ఆ సినిమాను మధ్యలోనే ఆపేస్తే బాగుండేది” అని పేర్కొన్నారు. “క్లోజ్ సర్కిల్ వాళ్లు ఈ సినిమాకు సంబంధించిన బుడాపెస్ట్ షెడ్యూల్ వృథా అయిన తర్వాత సినిమాను ఆపేయమని సూచించారు. కానీ నేను అంగీకరించలేదు. అప్పుడు అంగీకరించి ఉంటే.. ఇప్పుడు అందరం సంతోషంగా ఉండేవాళ్లం” అని అన్నారు. ‘ఏజెంట్’ షూటింగ్ సమయంలో బుడాపెస్ట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే టెక్నికల్ సమస్యలు, షెడ్యూల్ డిలేల కారణంగా ఆ షెడ్యూల్ పూర్తిగా వృథా అయినట్లు టాక్. ఈ విషయం అప్పట్లోనే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే నిర్మాత అనిల్ సుంకర వాటిని పట్టించుకోకుండా సినిమాను పూర్తి చేయడంతో.. చివరికి సినిమా ఫలితం డిజాస్టర్‌గా మారింది. తాజాగా ఆయన మరోసారి ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో పైవిధంగా వ్యాఖ్యానించారు.
2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ సినిమా అఖిల్ అక్కినేని కెరీర్‌లో మరచిపోలేని డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మించారు. స్పై థ్రిల్లర్‌గా ప్రకటించిన ఈ మూవీలో అఖిల్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
READ ALSO: Bangladesh Hindu Killing: బంగ్లాదేశ్‌లో మరోక హిందూ యువకుడి హత్య..