Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Chiranjeevi Anil Ravipudi Next Movie After Mana Shankara Vara Prasad Garu

Chiranjeevi: రేంజ్ రోవర్ వెనుక అసలు రహస్యం ఇదే: చిరంజీవి-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్!

Published Date :January 26, 2026 , 3:47 pm
By Bhargav Chaganti
Chiranjeevi: రేంజ్ రోవర్ వెనుక అసలు రహస్యం ఇదే: చిరంజీవి-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే వినోదానికి గ్యారెంటీ అని ఇటీవలే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిరూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మరోసారి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి మధ్య కుదిరిన బాండింగ్, సినిమా ఫలితం పట్ల మెగాస్టార్ ఎంతో సంతోషంగా ఉన్నారు. చిరంజీవి సాధారణంగా కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారు మరోపక్క అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరుని సరికొత్త కామెడీ టైమింగ్‌తో చూపించి ఫ్యాన్స్‌కు పసందైన వినోదాన్ని అందించారు, ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ALso Read:Murali Mohan : లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: పద్మశ్రీపై మురళీ మోహన్

ఈ సినిమా సక్సెస్ చూసి ముగ్ధుడైన చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడికి ఇటీవలే ఒక ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహుమతిగా ఇచ్చారు. అలాగే అనిల్ రావిపూడి ఇప్పటికే ఒక లైన్ చిరంజీవికి వినిపించినట్లు, అది మెగాస్టార్‌కు బాగా నచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం చిరంజీవి బాబీ కోల్లి దర్శకత్వంలో రాబోయే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది, అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి మెగాస్టార్ గ్రేస్ తోడైతే థియేటర్లలో నవ్వుల పూత పూయడం ఖాయం. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అందించిన జోష్‌ను కొనసాగిస్తూ రాబోయే ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Anil Ravipudi next film
  • Chiranjeevi
  • Chiranjeevi Anil Ravipudi combo
  • Chiranjeevi Next Movie

తాజావార్తలు

  • Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

  • RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

  • Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

  • Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!

  • Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions