Chiranjeevi – Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోకు.. కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు అనే వ్యాఖ్యను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ ALSO: PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది?
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాస్.. వింటేజ్ స్టైల్‌లో కనిపించి, అప్పటి ఎనర్జీ, అదే కామెడీ టైమింగ్‌తో తెరపై ప్రత్యక్షమై అభిమానులను సూపర్‌గా అలరించాడు. శంకర వరప్రసాద్ పాత్రలో ఆయన చూపిన నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. హీరోయిన్ నయనతారతో ఆయన కెమిస్ట్రీ, వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్, భీమ్స్ సిసిరియోలో సూపర్ హిట్ సాంగ్స్… అన్నీ కలిసి సినిమాను ఒక పూర్తి సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి.
Sometimes, words aren’t needed at all ❤️🤗#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wWZ77wGUIH
— Anil Ravipudi (@AnilRavipudi) January 12, 2026
READ ALSO: Elon Musk: గ్రోక్‌ను గెంటేసిన ఆ రెండు దేశాలు.. ప్రపంచ కుబేరుడికి దిమ్మతిరిగే షాక్!
