Site icon NTV Telugu

Chinta Mohan: ఉద్యోగాలు రాక.. పట్టభద్రులు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారు!

Chinta Mohan

Chinta Mohan

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘భారత దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సాగుతోంది. 11 ఏళ్లుగా ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?. మోడీ చెప్పిన వాగ్దానం అమలులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలేదు. ఒక్క ఉద్యోగం అయినా ప్రధాని ఇచ్చాడా?. ఉద్యోగాలు రాక పట్టభద్రులు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారు’ అని చింతా మోహన్ ఫైర్ అయ్యారు.

Also Read: Indrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. తిరుపతి తరహాలో భక్తులకు ఏర్పాట్లు!

’15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమైనా చేశాడా?. తన సొంత నియోజకవర్గానికి కూడా ఏమి చేయలేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్న చంద్రబాబు కనీసం ఇడ్లీ కొట్టు కూడా పెట్టలేదు. సామాజిక న్యాయం అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య గొడవలు పెట్టారు. దళితులకు న్యాయం అంటున్న నీవు 2 ఏళ్ళు సీఎంగా మాదిగలకు ఇవ్వు. దళితులు, మైనార్టీలు సంతోషంగా లేరు. ఒకప్పుడు పేదల గురించి అసెంబ్లీలో మాట్లాడేవారు కానీ.. ఇప్పుడు పరిస్తితి అలా లేదు. పనికిమాలిన మాటలు మాట్లాడుకునేందుకు అసెంబ్లీని వాడుకుంటున్నారు. రాష్ట్రంలో పేరుకే కూటమి.. కానీ వారిలో వారికే ఐక్యత లేదు. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికలు పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబుపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా తప్పు. పెండింగ్ లో ఉన్న 15 మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అమరావతి కి ఉన్న నిధులు మెడికల్ కళాశాలల నిర్మాణానికి లేవా?’ అని చింతా మోహన్ ప్రశ్నించారు.

Exit mobile version