15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. కొత్తగా నేను ఏదో చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు ‘వాట్సప్ పరిపాలన అంటూ.. వాటాల పరిపాలన’ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దళితుల జోలికి పోవడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదని చింతా మోహన్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
’15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కొత్తగా నేను ఏదో చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం. చంద్రబాబు వాట్సప్ పరిపాలన అంటూ వాటాల పరిపాలన చేస్తున్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం. కమిషన్ల కోసం కక్కుర్తిపడి మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కి చంద్రబాబు ప్రతిపక్షాన్ని కూనీ చేస్తున్నారు. యూరియా, ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దళితుల జోలికి పోవడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదు. ఎస్సీ వర్గీకరణ వెంటనే వెనుకకు తీసుకోవాలి’ అని సీనియర్ నాయకులు చింతా మోహన్ డిమాండ్ చేశారు.
Also Read: AP Liquor Scam: 3 గంటల హైడ్రామా తర్వాత.. లిక్కర్ స్కాం నిందితులు విడుదల!
‘దేశంలో ఎన్నికల విధానం లోపభూయిష్టంగా ఉంది. 60 లక్షల కోట్లు దొంగ ఓట్లు బయటపడ్డాయి. ప్రధాని మోడీతో ఎలక్షన్ కమిషన్ మిలాఖాత్ అయింది. ఎలక్షన్ కమిషన్లో దొంగ పనులు చేస్తున్నారు. ఎన్నికల్లో విధానంలో మార్పులు అవసరం. రష్యా వాళ్లు లీటర్ పెట్రోలు రూ.30 రూపాయలకు ఇస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్న ఆయిల్ను బీజేపీ ప్రభుత్వం తన మిత్రులకు ఇస్తుంది, ఇది దొంగ విధానం. ఇది మోడీ, అమిత్ షా చేస్తున్న దుర్మార్గం అన్యాయం. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి పెట్రోల్ బంకులు వద్ద ఆందోళన చేయాలని పిలుపునిస్తున్నా. ఏ రకంగా రుణమాఫీ చేస్తున్నారు. 10% కమిషన్ తీసుకుని గుజరాత్, ఆంధ్రలోనూ రుణమాఫీ చేశారు’ అని చింతా మోహన్ మండిపడ్డారు.
