Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్.. మరోసారి తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభం అవుతోందన్నారు.. ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేసి తీరుతామని ప్రకటించారు. ఇక, నిరుపేద వర్గాల అప్పుల మాఫీని మా మేనిఫెస్టోలో పెడతాం అన్నారు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అప్పులను మాఫీ చేస్తాం అంటున్నారు చింతామోహన్..
Read Also: Minister Seediri Appalaraju: విశాఖ రాజధానే మా ఆకాంక్ష.. మళ్లీ జగన్ వస్తేనే అది సాధ్యం..
మరోవైపు.. భారతదేశ చరిత్రలో నిన్న మరపురాని రోజుగా అభివర్ణించారు చింతామోహన్.. లాంగ్ లీవ్ సుప్రీం కోర్టు.. ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.. ఎలక్టోరల్ బాండ్లపై జడ్జిమెంట్ గ్రేట్ అన్న ఆయన… తీర్పు ఇచ్చిన వారికి సెల్యూట్ చేస్తున్నాను అన్నారు.. ఇక, ప్రజల ఇబ్బందులు చంద్రబాబు, వైఎస్ జగన్ లకు కనపడటం లేదు అని దుయ్యబట్టారు.. కాగా, రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం విదితమే.. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధమని తేల్చేసేన కోర్టు.. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్‌ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే.