OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- క్రమశిక్షణ చర్యల తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా చిన్నారెడ్డి..
- తాను పెద్ద ప్లాన్‌తోనే ఉన్నట్టు తాజా సంకేతాలు..
- ఇబ్రహీంపట్నం సమీపంలో కొందరితో సీక్రెట్ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వదిలేదే లే… తగ్గేదే లే….. అంటూ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు? కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాక కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న చిన్నన్నతాజాగా సీక్రెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఆ సమావేశంలో ఏమేం మాట్లాడుకున్నారు? పదవి పోగొట్టుకున్న పెద్దాయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? అసలా లెక్కలేంటి?
వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు, కాంగ్రెస్ పెద్దలపై కూడా హాటు ఘాటు వ్యాఖ్యలు చేసి…క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల పదవి పోగొట్టుకున్నారు సీనియర్ లీడర్ చిన్నారెడ్డి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్రమశిక్షణా సంఘం కూడా గతంలో కంటే వేగంగా స్పందించి నిర్ణయం తీసుకోవడంతో….. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పార్టీకి వీర విధేయుడినని చెప్పుకునే చిన్నారెడ్డి పోస్ట్ ఊస్ట్ అయింది. అయితే చర్యల వేళ సైలెంట్‌గా తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన చిన్నారెడ్డి… పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారన్నది లేటెస్ట్ టాక్.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
అందులో భాగంగా…. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కొందరితో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ మీటింగ్‌కు పలువురు కాంగ్రెస్ అసంతృప్త వాదులతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సైతం హాజరైనట్టు చెప్పుకుంటున్నారు. సమావేశ ఎజెండా, నిర్ణయాలతో గురించి మాట్లాడుకోవడంతోపాటు…రాష్ట్ర పార్టీ నేతలు తన విషయంలో వ్యవహరించిన తీరును ఢిల్లీ పెద్దలకు వివరించాలని నిర్ణయించినట్టు సమాచారం. తగ్గేదే లే, వదిలేదే లే అంటూ సీక్రెట్ మీటింగ్‌లో చిన్నారెడ్డి తన మనుషులతో అన్నట్టు తెలిసింది.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాదని , మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన గులాబీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని, అందుకే సొంత పార్టీ అభ్యర్ది గెలుపుకోసం కాకుండా బీఆర్ఎస్ అభ్యర్ది గెలుపునకు పని చేశారంటూ మరోసారి ఆ ఆంశాన్ని తెరపైకి తెస్తోంది ఎమ్మెల్యే శిబిరం. వనపర్తి ప్రాంతంలో చిన్నారెడ్డి తో కలిసి నడిచే కాంగ్రెస్ వారెవరూ లేరని, రహస్య మీటింగ్స్‌తో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారని అంటోంది మేఘారెడ్డి వర్గం. చిన్నారెడ్డి బీఆర్ఎస్తో టచ్ లో ఉన్నారు కాబట్టే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రహస్య సమావేశానికి హాజరై ఉండొచ్చంటూ ఎండగడుతోంది ప్రత్యర్థి వర్గం.
కారు పార్టీ డైరెక్షన్లోనే చిన్నారెడ్డి అడుగులు వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో… ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న చిన్నారెడ్డి.. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్ పెట్టడం వెనకున్న లెక్కలేంటంటూ ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయట. ఇక ఆయన అడుగులు తెలంగాణ భవన్ వైపేనని కొందరు విశ్లేషిస్తుండగా… అసెంబ్లీ ఎన్నికల నుంచే ఆ పార్టీతో అంటకాగుతున్నారంటూ ఎండగడుతోంది వైరి వర్గం. దీంతో చిన్నారెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?