Site icon NTV Telugu

Flats as Gift: ఎంత మంచి సంస్థో.. ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్..

Home

Home

కొన్ని కంపెనీలు ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తుంటాయి. సంస్థ ఉన్నతికి కృషి చేసిన ఉద్యోగులకు బోనస్ లు, గిఫ్టులు ఇస్తుంటాయి. తాజాగా ఓ చైనీస్ కంపెనీ తన ఉద్యోగులను దీర్ఘకాలికంగా నిలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానానికి నడుంబిగించింది. ఈ కంపెనీ కష్టపడి పనిచేసే, నమ్మకమైన ఉద్యోగులకు ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్, వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ లభిస్తుందని ప్రకటించింది. ఈ ఫ్లాట్ ధర సుమారు రూ.12 మిలియన్ల నుండి రూ.15 మిలియన్ల వరకు ఉంటుంది.

Also Read:Naga Chaitanya :నాగచైతన్య కెరీర్‌లో మరో సర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!

ఆ కంపెనీ ఇప్పటికే తన ప్రాంగణానికి సమీపంలో మొత్తం 18 ఫ్లాట్‌లను కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, ఈ ఫ్లాట్‌లను రెండు సంవత్సరాల క్రితం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్‌లను కొనుగోలు చేయడానికి కంపెనీ 10 మిలియన్ యువాన్లకు (సుమారు రూ. 12.7 కోట్లు) పైగా ఖర్చు చేసింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఐదుగురు ఉద్యోగులకు ఫ్లాట్‌లు అందించింది. వీరిలో ఇద్దరు జూనియర్ పోస్టుల నుంచి మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగిన ఉద్యోగులు ఉన్నారు. ఫ్లాట్‌లను స్వీకరించే ఉద్యోగులు కనీసం రాబోయే ఐదు సంవత్సరాలు కంపెనీలో పనిచేయాల్సిన ఒప్పందంపై సంతకం చేయాలి.

Also Read:Uttam Kumar Reddy : కేసీఆర్‌ కరెక్ట్‌గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు

కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ ప్రకారం, కష్టపడి పనిచేసే మరియు సమర్థవంతమైన ఉద్యోగులను గౌరవించడమే ఈ పథకం లక్ష్యం . వచ్చే ఏడాది మరో ఎనిమిది ఫ్లాట్‌లను అందజేస్తామని, మూడు సంవత్సరాలలోపు మొత్తం 18 ఫ్లాట్‌లను ఉద్యోగులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలిసిన పలు కంపెనీల ఉద్యోగులు ఎత మంచి సంస్థో అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

Exit mobile version