కొన్ని కంపెనీలు ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తుంటాయి. సంస్థ ఉన్నతికి కృషి చేసిన ఉద్యోగులకు బోనస్ లు, గిఫ్టులు ఇస్తుంటాయి. తాజాగా ఓ చైనీస్ కంపెనీ తన ఉద్యోగులను దీర్ఘకాలికంగా నిలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానానికి నడుంబిగించింది. ఈ కంపెనీ కష్టపడి పనిచేసే, నమ్మకమైన ఉద్యోగులకు ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్, వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ లభిస్తుందని ప్రకటించింది. ఈ…