VAC Mode Signaling: ఇక నో వెయిటింగ్.. గ్రేటర్లో వీఏసీ మోడ్ సిగ్నలింగ్ వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VAC Mode Signaling: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా, ఎన్ని స్కైవేలు నిర్మించినా ట్రాఫిక్ తగ్గడం లేదు. సిగ్నల్స్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రాకపోకల ఆధారంగా సిగ్నల్స్ మార్చే అత్యాధునిక టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక సిగ్నలింగ్ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జియావుద్దీన్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, విద్యుత్ శాఖ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 404 ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిస్టమ్ కంట్రోల్ (ATSC), పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ATSCలో భాగంగా మూడు రకాల సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. ఏ వైపు (ఫిక్స్డ్ మోడ్) ఎన్ని సెకన్లలో సిగ్నల్ ఇవ్వాలి అనేది ఒకటి.. వెహికల్ యాక్టివేటెడ్ కంట్రోల్ (వీఏసీ), సిగ్నలింగ్ సిస్టమ్ మ్యాన్యువల్ మోడల్లో పనిచేస్తుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని బట్టి పోలీసులు వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నారు.
Read also: Pregnancy: ప్లాస్టిక్ వాడకం వల్ల సంతాన సమస్యలు.. ఎన్ఐఎన్ షాకింగ్ విషయాలు
Also Read
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
- Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
- Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
- Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
కానీ ఫిక్స్డ్ మోడ్‌లో భాగంగా, ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా నిర్ణీత సమయం ఎరుపు మరియు ఆకుపచ్చ సిగ్నల్లు ఉంటాయి. ఒక్కోసారి ఆ దారిలో ట్రాఫిక్ లేకపోయినా.. ఆ రోడ్డుపై గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు పచ్చని చీలిక తమపై పడే వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఇక నుంచి ఎదురుచూడాల్సిన పనిలేదు. ట్రాఫిక్ ఆధారంగా సిగ్నల్స్ మారే చోట వీఏసీ మోడ్ వినియోగంపై దృష్టి సారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానంలో, గ్రీన్ సిగ్నల్ కొంత సమయం పడుతుంది. ఆ రోడ్డులో వాహనాలు లేకుంటే ఆటోమేటిక్‌గా రెడ్ సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మరో వైపు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. దీంతో సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు వేచి ఉండకుండా వెళ్లిపోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రయాణ సమయం తగ్గుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రోడ్డు దాటే పాదచారులకు నగరంలో పెలికాన్ సిగ్నల్స్ పెంచేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 78 పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి.
Vastu Tips: కలలో కాకి కనిపిస్తే శుభమా.. అశుభమా?
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!