Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News China Gelao Tribe Bizarre Marriage Custom Bride Teeth Removal Tradition

Gelao Tribe Tradition: గమ్మత్తు ఆచారం! పెళ్లికి ముందు వధువు పళ్ళను సుత్తెతో రాలగొడతారట..

Published Date :December 15, 2025 , 4:55 pm
By RAMAKRISHNA KENCHE
Gelao Tribe Tradition: గమ్మత్తు ఆచారం! పెళ్లికి ముందు వధువు పళ్ళను సుత్తెతో రాలగొడతారట..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gelao Tribe Tradition: ప్రపంచంలో అనేక దేశాలు.. ఆయా దేశాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయి. అయితే.. కొన్ని తెలగలకు చెందిన సంస్కృతులు, ఆచారాలు విభిన్నంగా ఉంటాయి. పెళ్లికి ముందు వధువు పళ్లు రాలగొట్టే సంప్రదాయాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని గెలావో (Gelao) అనే గిరిజన సమూహంలో ఒకప్పుడు చాలా విచిత్రమైన, కఠినమైన సంప్రదాయం ఉండేది. పెళ్లి కావాలంటే వధువుకు పై దంతాల్లో ఒకటి లేదా రెండు తీయాల్సి వచ్చేది. అలా చేయకపోతే వరుడి కుటుంబానికి అపశకునం జరుగుతుందని నమ్మేవారు. కొన్ని సందర్భాల్లో తీసేసిన పళ్ళ స్థానంలో అలంకరణ కోసం కుక్క పళ్ళను సైతం పెట్టుకునే వారు..

READ MORE: Motorola Edge 50 Pro: మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పై రూ.18,650 డిస్కౌంట్.. 50MP సెల్ఫీ కెమెరా, 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో..

చైనా మార్నింగ్ పోస్ట్‌లోని కథనం ప్రకారం.. గెలావో అనేది చైనా, వియత్నాం దేశాల్లో నివసించే ఒక జాతి. 2021 నాటికి చైనాలో వీరి జనాభా సుమారు 6.77 లక్షలకు పైగా ఉంది. వీరు ఎక్కువగా దక్షిణ చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ పశ్చిమ భాగంలో ఉన్న గెలావో స్వయంప్రభుత్వ ప్రాంతాల్లో నివసిస్తారు. సంప్రదాయంగా వీరు వ్యవసాయంపై ఆధారపడతారు. ఎక్కువగా ప్రాంతాల్లో బియ్యం సాగు చేస్తారు.. కొండ ప్రాంతాల్లో ఇతర ధాన్యాలను పండిస్తారు. ఈ తెగలో పెళ్లి ముందు పళ్ళు తీయించే ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగింది. దీనికి సంబంధించిన ప్రాచీన రాతపూర్వక ఆధారాలు {దక్షిణ సాంగ్ రాజవంశ కాలం (1127–1279)} సైతం ఉన్నాయి.

READ MORE: TPCC Mahesh Goud : బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుంది

గెలావో యువతి సుమారు 20 ఏళ్ల వయసుకు వస్తే పెళ్లి చేసేవాళ్లు. వివాహానికి సిద్ధమయ్యే సమయంలో వధువు ముందు పళ్ళలో ఒకటి లేదా రెండు బలవంతంగా తొలగించేవాళ్లు. దీనికి వెనుక ఒక జానపద కథ సైతం ఉంది. చాలా కాలం క్రితం ఒక గెలావో యువతి తన పెళ్లికి ముందు గ్రామానికి వచ్చే సమయంలో కొండపై నుంచి పడిపోయిందట. అయినా ఆమె బతికింది. కానీ.. ఆమె తన ముందు రెండు పళ్ళను కోల్పోయిందట. ఆమె ధైర్యం, త్యాగాన్ని గౌరవిస్తూ, ఆ తర్వాత పెళ్లి చేసుకునే గెలావో యువతులు పళ్ళు తీసేయించుకోవడం సంప్రదాయంగా మారిందని చెబుతారు. ఈ పళ్ళు తీసే ప్రక్రియను సైతం ప్రత్యేక పద్ధతిలో జరిగేది. ముందుగా ఒక కుండ నిండా మద్యం సిద్ధం చేసేవారు. ఆ తర్వాత అమ్మాయి మామ (తల్లి అన్న)ను గౌరవంగా ఇంటికి ఆహ్వానించేవారు. చిన్న సుత్తితో మేనమామ తన కోడలి పళ్ళను కొట్టి తీసేసే వాడు. ఒకవేళ మామ లేకపోతే.. తల్లి వైపు బంధువుల్లో అదే తరం చెందిన మరొక పురుషుడు ఈ పని చేసేవాడు. పళ్ళు తీసిన తర్వాత గాయాలు త్వరగా మానేందుకు ఒక ప్రత్యేక ఔషధ పొడిని చిగుళ్లపై రాసేవారు. ఒకవేళ గెలావో యువతి ఈ సంప్రదాయం చేయించుకోకపోతే, ఆమెను సమాజంలో ఎగతాళి చేయడం, అవమానించడం జరిగేది.

READ MORE: UP: 13 ఏళ్ల కొడుకుని వదిలి లివ్-ఇన్ రిలేషన్‌లో మహిళ.. తల నరికి చంపిన ప్రియుడు..

ఈ పళ్ళు తీయించే ఆచారానికి వేర్వేరు కారణాలు చెప్పుకుంటారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. గెలావో ప్రజలు నివసించే ప్రాంతాల్లో విషపదార్థాలు ఎక్కువగా ఉండేవి. అనుకోకుండా వాటిని తిన్నప్పుడు లేదా సేవించినప్పుడు మహిళల దవడలు బిగుసుకుపోయేవట. ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని మొక్కలతో మందును తయారు చేసి నోటిలో వేసేవారట. కానీ.. రెండు దవడలు బిగుసుకుపోవడంతో సాధ్యం కాలేదట. అందుకే.. ముందు పళ్ళు లేకపోతే ఔషధ మొక్కలతో చేసిన మందులు తేలికగా నోటిలో వేయవచ్చని నమ్మకం ఉండేది. పై ముందు పళ్ళు ఉంటే భర్త కుటుంబానికి దురదృష్టం వస్తుందని, సంతానం కలగదని మరికొందరు నమ్మేవారు. కుటుంబ అభివృద్ధికి అడ్డుకాకుండా ఉండేందుకు పళ్ళను తీసేయాల్సిందే అనుకునేవారు. 1957లో గుయిజౌ ప్రావిన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎథ్నిక్ స్టడీస్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ కఠినమైన సంప్రదాయం గుయిజౌ ప్రావిన్స్‌లోని పుడింగ్, ఝిజిన్, రెన్‌హువై వంటి ప్రాంతాల్లో క్వింగ్ రాజవంశం చివరి కాలం (1644–1912) వరకు కొనసాగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ఆచారం తగ్గిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ancient Chinese customs
  • Bride teeth removal ritual
  • China Gelao tribe tradition
  • Chinese tribal marriage practices
  • Gelao tribe marriage ritual

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions