Site icon NTV Telugu

Telangana Weather: తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా.. మరో మూడు రోజులు వణుకుడే…

Telangana Wether

Telangana Wether

Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా చలి పెరిగింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు కూడా చలి రోజురోజుకు పెరుగుతోందని వెల్లడించారు. మూడు రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. డిసెంబర్ నెలాఖరుకు మళ్లీ చలి తీవ్రత పెరిగి చలికి తోడు చలి గాలులు వీస్తాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతుందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు.ఇక భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Read also: Raviteja: ఈగల్ తగ్గే ప్రసక్తే లేదు… సంక్రాంతికే వస్తుంది

రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతోంది. హైదరాబాద్ శివారులో అత్యల్పంగా 28° పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 31° నమోదైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల సెల్సియస్‌, మెదక్‌లో 12.8, పటాన్‌చెరులో 13.2, ఆదిలాబాద్‌లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్‌లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్‌లో 7.61, హైదరాబాద్‌లో 16.56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. .4, ఖమ్మం 17, మహబూబ్ నగర్ 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చలి గాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు వెచ్చని బట్టలు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Automatic Payment Limit: వారికి శుభవార్త.. లిమిట్ పెంచిన ఆర్బీఐ..

Exit mobile version