Telangana Weather: తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా.. మరో మూడు రోజులు వణుకుడే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా చలి పెరిగింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు కూడా చలి రోజురోజుకు పెరుగుతోందని వెల్లడించారు. మూడు రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. డిసెంబర్ నెలాఖరుకు మళ్లీ చలి తీవ్రత పెరిగి చలికి తోడు చలి గాలులు వీస్తాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతుందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు.ఇక భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Read also: Raviteja: ఈగల్ తగ్గే ప్రసక్తే లేదు… సంక్రాంతికే వస్తుంది
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతోంది. హైదరాబాద్ శివారులో అత్యల్పంగా 28° పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 31° నమోదైంది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో 12.5 డిగ్రీల సెల్సియస్, మెదక్లో 12.8, పటాన్చెరులో 13.2, ఆదిలాబాద్లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్లో 7.61, హైదరాబాద్లో 16.56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. .4, ఖమ్మం 17, మహబూబ్ నగర్ 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చలి గాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు వెచ్చని బట్టలు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Automatic Payment Limit: వారికి శుభవార్త.. లిమిట్ పెంచిన ఆర్బీఐ..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!