NTV Telugu Site icon

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకే అనుమతి

Ttd

Ttd

తిరుమల నడకమార్గాలలో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఇవాళ కూడా అలిపిరి నడకమార్గంలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. దీంతో వారిని గుర్తించి తిరిగి కుటుంభసభ్యులుకు అప్పగించారు భధ్రతాసిబ్బంది. మరోవైపు నడకమార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీడీడీక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల భధ్రత దృష్టా రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే చిన్నారులను నడకమార్గంలో అనుమతించనుంది టీటీడీ. మధ్యాహ్నం 2 గంటల తరువాత 15 సంవత్సరాలు లోబడిన చిన్నారులకు నడకమార్గంలో అనుమతి నిరాకరించింది.

Health News: అరటి పండు పరగడుపున తినొచ్చా?

వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టి తిరిగి సాధరణ పరిస్థితులు నెలకొన్న తరువాతే చిన్నారులుకు పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై తిరుమలకు వెళ్లే దారిలో చిరుత దాడికి పాల్పడింది. రెండు రోజుల క్రితం చిరుత దాడిలో అక్షిత అనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనల నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు అలిపిరి మార్గంలో వెళ్లే పిల్లలకు ట్యాగ్ లను ఏర్పాటు చేస్తుంది టీటీడీ. తిరుమల నడక మార్గంలో ఏడో మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తుల బృందాలను అనుమతించనున్నారు. భక్తుల ముందు, వెనుక రోప్ పార్టీలను టీటీడీ నియమించింది. ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

Ankita Lokhande: తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్

మరోవైపు నిన్నటి రోజు కూడా నడకమార్గం, ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో చిరుతల సంచారిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలలో, గాలిగోపురం నుంచి 7వ మైలు వద్ద ప్రాంతంలో చిరుత సంచారిస్తుంది. రెండవ ఘాట్ రోడ్డు 38వ మలుపు వద్ద చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే భవిష్యత్త్ లో ఎలాంటి ఘటనలు జరగకుండ ఉండేందుకు టీటీడీ అప్రమత్తమైంది.