Chidambaram: రూపాయి బలహీనపడటం లేదు.. డాలర్ విలువ బలపడుతోందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమిపాలైన వారు సాధారణంగా చెప్పే ‘మేం ఓడిపోలేదు. అవతలి పార్టీనే గెలిచింది’ అన్నట్లుగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Farooq Abdullah: న్యాయం జరిగేవరకు జమ్మూలో హత్యలు ఆగవు.. ఫరూక్ సంచలన వ్యాఖ్యలు
రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడంపై సీతారామన్ శనివారం వాషింగ్టన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడురు. రూపాయి బలహీనపడటం లేదని, డాలర్ విలువే బలపడుతోందని ఆమె అన్నారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే రూపాయి విలువ ఆశాజనకంగానే ఉన్నట్లు చెప్పారు. ఆమె చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిర్మలమ్మ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ చిదంబరం ట్విటర్లో స్పందించారు. “రూపాయి బలహీనపడట్లేదు.. డాలరే బలపడుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది అక్షరాలా నిజమే..! ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి లేదా పార్టీ కూడా ఎప్పుడూ ఇలాగే ‘మేం ఓడిపోలేదు. అవతలి పార్టీనే గెలిచింది’ అని చెబుతుంటారు” అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.