Site icon NTV Telugu

Ram Mandir Model: 20 కిలోల బిస్కెట్లతో రామమందిర నమూనా..

Ram Mandir Biscuts

Ram Mandir Biscuts

యావత్ దేశం దృష్టి మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా.. రాంలాలా కోసం వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల బహుమతులు వస్తున్నాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన యువ కళాకారుడు రాముడి కోసం ప్రత్యేకంగా తయారు చేశాడు.

Read Also: Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. బాణాసంచా పేలి 20 మంది మృతి

20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనాను తయారు చేశాడు. దుర్గాపూర్‌కు చెందిన ఛోటాన్ ఘోష్ మోను అనే యువకుడు ఈ మోడల్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చంద్రయాన్ విజయవంతమైన మిషన్ తర్వాత, అతను చంద్రయాన్ ప్రతిరూపాన్ని తయారు చేశాడు. ఇప్పుడు బిస్కెట్లతో రామ మందిరానికి ప్రతిరూపాన్ని తయారు చేశాడు.

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన

కాగా.. ఛోటాన్ ఘోష్ ఆచరణాత్మకంగా అయోధ్యలోని రామ మందిరాన్ని దుర్గాపూర్ కు తీసుకువచ్చాడని స్థానికులు చెబుతున్నారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించే ముందు, నగరవాసులు ఈ రామాలయాన్ని సందర్శించవచ్చని అంటున్నారు. చోటన్ ఘోష్ బిస్కెట్లతో ఈ రామ మందిరానికి ప్రతిరూపాన్ని తయారు చేశానని చెప్పారు. 4×4 అడుగుల రామాలయం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేయడానికి అతనికి ఐదు రోజులు పట్టింది. దీని తయారీలో బిస్కెట్లు కాకుండా థర్మాకోల్, ప్లైవుడ్, గ్లూ-గన్ ను ఉపయోగించారు. అయితే ఛోటాన్ ఘోష్ తయారు చేసిన ఈ అద్భుత తయారీని అందరూ అభినందిస్తున్నారు.

Exit mobile version