యావత్ దేశం దృష్టి మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా.. రాంలాలా కోసం వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల బహుమతులు వస్తున్నాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన యువ కళాకారుడు రాముడి కోసం ప్రత్యేకంగా తయారు చేశాడు.