Viral Video: ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు ఘోర అవమానం.. మహాయోధుడి చిత్రాన్ని ఇలా వాడుకోవడం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే యువతలో ఊపు వస్తుంది. శివాజీ చరిత్ర చెబితే గూస్బంప్స్ పక్కా. సమ సమాజ స్థాపన, హిందూ రాజ్యం ఏర్పాటు కోసం శివాజీ చేసిన కృషి అంతా ఇంతా కాదు.. అలాంటి మహానీయుడి చిత్రపటానికి తాజాగా ఘోర అవమానం ఎదురైంది. పురుషులు, స్త్రీల బాత్రూమ్లు గుర్తు పట్టేలా సింబల్స్ ఉంచుతారన్న విషయం తెలిసిందే. ఇక్కడ పురుషుల బాత్రూమ్ బయట ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని ఉంచారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాష్‌రూమ్‌ల బయట పురుష–మహిళల సూచికలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణి పద్మిని చిత్రాలను ఉపయోగించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా జనాలు ఆగ్రహానికి గురయ్యారు. వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఇది సిక్రీ గ్రామంలోని “మిలాన్ బ్యాంక్వెట్ హాల్”లో తీసినదని చెప్పడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
ఈ క్లిప్ బయటకు వచ్చిన వెంటనే అనేక మంది నెటిజన్లు దీనిని గొప్ప యోధుడైన శివాజీ మహారాజ్‌కు అవమానంగా పేర్కొంటూ హాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు ఈ బ్యాంక్వెట్ హాల్ హర్యానాలోని ఓ మాజీ మంత్రికి సంబంధించినదని సైతం ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజకీయ రంగు సైతం పులుముకుంది. అయితే ఈ ఆరోపణలను బ్యాంక్వెట్ హాల్ యజమాని టిపర్చంద్ ఖండించారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం తనదికాదని స్పష్టం చేశారు. తనను అపకీర్తి పరచడానికి కావాలనే తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రాంతంలో అక్రమంగా ఉన్న కొన్ని బ్యాంక్వెట్ హాళ్లను కూల్చివేయడంతో అసంతృప్తి చెందిన కొందరు తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని అన్నారు. ఈ ఘటనపై రాజకీయ స్పందనలు సైతం వచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ శివాజీ మహారాజ్ వారసత్వాన్ని పదేపదే అవమానిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ దృశ్యాలు పూర్తిగా అంగీకరించలేనివని పేర్కొంటూ వెంటనే వాటిని తొలగించాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
READ MORE: Today Astrology: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు స్నేహితులతో జాగ్రత్త!
This is absolutely unacceptable. Chhatrapati Shivaji Maharaj is a revered figure for us, his image cannot be misused this way. I urge the Haryana Government to immediately get this image removed.
Why do BJP governments repeatedly allow insults to Chhatrapati Shivaji Maharaj's… pic.twitter.com/XEO8BNgBaP
— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) February 23, 2026
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!